వీసా బాలాజీ టెంపుల్ లేదా వీసా బాలాజీ దేవునిగా ప్రసిద్ది చెందినది హైదరాబాద్ కి అతి చేరువులో ఉన్న చిల్కూర్ బాలాజీ టెంపుల్. చిల్కూర్ బాలాజీ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి అలాగే వారి భార్యలైన శ్రీదేవి, భూదేవి కొలువై ఉన్నారు.
అనేకమంది భక్తులు విదేశాలకు వెళ్లే కోరిక తో ఇక్కడికి వస్తారు. 75,000 నుండి 1 లక్ష భక్తులు చిలుకూరు బాలాజీ గుడిలోని స్వామి వారిని దర్శించుకుంటారు. దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య ప్రతియేటా పెరుగుతూనే ఉంది.
ఇక్కడ స్వామి వారిని దర్శిస్తే వీసా దొరుకుతుందని ఒక నమ్మకం. ముఖ్యంగా అమెరికా వీసా కొరకు ప్రయత్నించే భక్తులు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో దర్శనార్థం వస్తూ ఉంటారు.
వీసా కొరకు ప్రయత్నించే భక్తులు మొదటగా చిలుకూరు బాలాజీ దేవాలయం చుట్టూ 11 ప్రదక్షణాలు చేస్తారు.
వారి కోరిక నెరవేరిన తరువాత దేవాలయం చుట్టూ 108 ప్రదక్షణాలు చేసి మొక్కును చెల్లించుకుంటారు.
డబ్బులు అంగీకరించని ఏకైక ఆలయంగా ప్రపంచవ్యాప్తంగా ఈ దేవాలయం ప్రాచుర్యం పొందింది. ఈ గుడిలో కానుకల ఉండి ఎక్కడా కనిపించదు.
నిజానికి ఈ గుడిలో ఎటువంటి హుండీలు ఉండవు. దేవుని దృష్టిలో అందరూ సమానం. అందుకనే ఈ గుడిలో ప్రముఖులకి ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు.
ఈ ఆలయం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో లేదు. ఈ ఆలయ నిర్మాణ శైలిని అధ్యయనం చేసిన తరువాత ఈ ఆలయం దాదాపు 500 ఏళ్ల పూర్వానిదని నమ్మకం.
చిలుకూరు బాలాజీ గుడి ప్రొద్దున 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మరియు మధ్యాహ్నం 4 నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరవబడి ఉంటుంది.
ఒస్మాన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న అందంగా ఉన్న ఈ ఆలయం, మెహిదీపట్నం నుండి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెదీపట్నం నుండి ఆర్టీసీ బస్ సర్వీస్ చిలుకూరు బాలాజీ టెంపుల్ వరకు నడుపుతున్నారు.
విలక్షణమైన నిర్వహణా శైలి వల్ల ఈ ఆలయానికి వేలమంది పర్యాటకులు ప్రతి సంవత్సరం తరలి వస్తారు.
Thanks for the information.
Keep posting these type of articles.