Introduction
Lingashtakam is a prayer hymn of Lord Shiva. Lingastaka Stotra is one of the most recited hymns by Hindus. Lingashtaka consists of 8 stanzas in total, each stanza is written in praise of Lord Shiva.
Benefits
Frequent recitation of the Lingastaka Stotra brings peace of mind, and gradually leads one away from evil and bad habits. The elders that reciting the Lingastaka Stotra with great devotion believe it will lead to Shivaloka.
Lingastakam in Telugu
లింగాష్టకమ్
బ్రహ్మమురారి సురార్చిత లింగం – నిర్మల భాసిత శోభిత లింగం|
జన్మజ దు:ఖ వినాశక లింగం – తత్ర్పణమామి సదాశివ లింగం||
దేవముని ప్రవరార్చిత లింగం – కామదహన కరుణాకర లింగం|
రావణదర్ప వినాశక లింగం – తత్ర్పణమామి సదశివ లింగం||
సర్వసుగంద సులేపిత లింగం – బుద్దివివర్ధన కారణ లింగం|
సిద్ధ సురాసుర వందిత లింగం – తాత్ర్పణ మామి సదశివ లింగం||
కనక్ మహామణి భూషిత లింగం – ఫణిపతివేష్టిత శోభిత లింగం|
దక్షసుయజ్ఞ్ వినాశన లింగం – తత్ప్రణమామి సదాశివ లింగం||
కుంకుమ చందన లేపిత లింగం – పంకజహార సుశోభిత లింగం|
సంచిత పాప వినాశక లింగం – తత్ప్రణమామి సదాశివ లింగం||
దేవగణార్చిత సేవిత లింగం – భవైర్భక్తిభి రేవచ లింగం|
దినకరకోటి ప్రభాకర లింగం – తత్ప్రణమామి సదాశివ లింగం||
అష్టదళోపరి వేష్టిత లింగం – సర్వసముద్భవ కారణ లింగం|
అష్టదరిద్ర వినాశన లింగం – తత్ప్రణమామి సదాశివ లింగం||
సురగురు సురవర పూజిత లింగం – సురవన్ పుష్పసదార్చిత లింగం|
పరమపదం పరమాఆత్మక లింగం – తత్ప్రణమామి సదాశివ లింగం||
లింగాష్టక మిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ|
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే||
లింగాష్టకం అర్థం
బ్రహ్మ విష్ణు దేవతలచే పూజింపబడే లింగం
నిర్మలమైన మాటలతో శోభించబడిన లింగం |
జన్మ వల్ల పుట్టే దుఃఖాలను నాశనం చేసే లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం ||
దేవమునులు ఋషులు పూజించే లింగం
కామాన్ని దహనం చేసి, కరుణను చూపే చేతులుగల లింగం |
రావణుని గర్వాన్ని నాశనం చేసిన లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం ||
అన్ని గంధాలు చక్కగా పూసిన లింగం
బుద్ధివికాసానికి కారణమైన లింగం
సిద్దులు దేవతలు రాక్షసులచే కీర్తింపబడే లింగం |
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం ||
బంగారు మహామునులచే అలంకరింపబడే లింగం
నాగరాజు నివాసంచే అలంకరింపబడే లింగం |
దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేసిన లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం ||
కుంకుమ గంధము పూయబడిన లింగం
కాలువల హారంచే శోభించబడే లింగం |
సంక్రమించిన పాపాలన్నీ నాశనం చేసే లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం ||
దేవగణాల చేత పూజింపబడే సేవించబడే లింగం
భావంచే కూడిన భక్తిచే పూజింపబడే లింగం |
కోటి సూర్యుల కాంతిచే వెలిగిపోయే లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం ||
ఎనమిది రకాల ఆకులపై నివసించే లింగం
అన్నీ సరిగ్గా ఉద్బవించాడని కారణమైన లింగం |
అష్ట దారిద్య్రాలను నాశనం చేసి లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం ||
దేవతల గురువు దేవతలు పూజించే లింగం
దేవతల తోటల్లోని పుష్పాలచే పూజింపబడే లింగం |
నీ సన్నిధియే ఒక స్వర్గం లింగమా
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం ||
లింగాష్టకాన్ని శివుడి సన్నిధిలో చదివితే పుణ్యం వొస్తుంది
శివలోకం లభిస్తుంది శివుడిలో ఐక్యమవడానికి మార్గం దొరుకుతుంది